![]() |
![]() |
- మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో రెండో సినిమా!
- మరో సంక్రాంతి హిట్ సాధించిన మెగాస్టార్
- థియేటర్లలో అభిమానుల సందడి!
ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవల తను చేసిన సినిమాలతో కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు. గాడ్‌ఫాదర్, భోళాశంకర్ వంటి సినిమాలు ప్రేక్షకుల్ని, అభిమానుల్నే కాదు, చిరంజీవిని కూడా నిరాశకు గురి చేశాయి. తాజాగా ఈ సంక్రాంతికి విడుదలైన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం తొలిరోజు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. ప్రీమియర్లతోపాటు, రిలీజ్ రోజు మంచి ఓపెనింగ్స్‌తో ముందుకు దూసుకెళ్తోంది.
దేశవ్యాప్తంగా ఈ సినిమా 37 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రీమియర్స్ ద్వారా ఆదివారం 8.6 కోట్లు కలెక్ట్ చేయగా, సోమవారం థియేటర్ల ద్వారా 28.50 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్‌లో ఓవర్సీస్ ప్రీమియర్స్ ద్వారా 1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన రెండో చిత్రంగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ నిలిచింది. అంతేకాదు, 24 గంటల్లో 2 లక్షల 86వేల టికెట్స్ సేల్ అయినట్టు బుక్‌మై షో లెక్కలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ముందుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేసిన దాన్నిబట్టి పెయిడ్ ప్రీమియర్ల ద్వారా మొదటి రోజు 75 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఇది రెండో పెద్ద ఓపెనింగ్ అనుకోవచ్చు. ఇంతకు ముందు సైరా చిత్రానికి ఈ తరహా కలెక్షన్స్ వచ్చాయి. ఈ లెక్కలన్నీ ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న అనధికార సమాచారం మాత్రమే. చిత్ర యూనిట్ ఒరిజినల్ ఫిగర్స్‌ను ఎనౌన్స్ చెయ్యాల్సి ఉంది. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత చిరంజీవికి ఒక మంచి కమర్షియల్ హిట్ లభించిందని మాత్రం చెప్పొచ్చు.
![]() |
![]() |