![]() |
![]() |

-మారిన లెక్కలు ఏంటి!
-ఇంతకీ ఏంటి ఆ లెక్కలు
-చిరంజీవి పడ్డ కష్టం తెలుసా!
-అనిల్ రావిపూడి మేజిక్ వర్క్ అవుట్ అయ్యిందా!
మన శంకర వరప్రసాద్ గారు ప్రీమియర్స్ నుంచే ఆల్ సెంటర్స్ లో పాజిటివ్ టాక్ తో స్ప్రెడ్ అవుతుంది. చివరి ఇరవై నిముషాలు వెంకీ గౌడ కలవడం,నయనతార స్క్రీన్ ప్రెజెన్స్, అనిల్ రావిపూడి రచనా, దర్శకత్వ ప్రతిభ తో హిట్ రేంజ్ కూడా పెరిగిందనే అభిప్రాయాన్ని అభిమానులు, ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియాఛానల్ తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మన శంకర వరప్రసాద్ గురించి అనిల్ రావిపూడి పంచుకున్న పలు విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అనిల్ రావిపూడి మాట్లాడుతు ఏ హీరోతో చేస్తే ఆ హీరోకి తగ్గట్టుగా నేను మారిపోతాను. చిరంజీవి గారి స్ట్రెంత్ పాయింట్స్ ని పట్టుకొని కథ తయారు చేశాను హ్యూమన్ రిలేషన్ లో చిరంజీవి గారు దిగారంటే దాని ఎఫెక్ట్ వేరేలా ఉంటుంది. వెనక్కి వెళ్లి చూస్తే ఎన్నో సినిమాలు ఉన్నాయి. అందుకే మన పక్కింటి అబ్బాయిలా చిరంజీవి గారు ఉండేలా చేసుకున్నాను. నా క్యారక్టర్ కి తగ్గట్టుగా బరువు విషయంలో గ్రాము బరువు పెరిగినా కన్ సైడ్ చేసేవారు. నా సినిమాకి బాగా తగ్గడం నా అదృష్టం. ఫస్ట్ లుక్ చూసి సంతోషంతో రెండు రోజుల పాటు నిద్ర కూడా పోలేదు.
Also read: ఇది నా స్టామినా.. రికార్డు కలెక్షన్స్ వసూలు
మేకింగ్ విషయంలో కూడా చిరంజీవి గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. 150 సినిమాలు చేసిన హీరోలాగా కాకుండా అవుట్ ఫుట్ విషయంలో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.ఆయన ఇచ్చిన సజిషన్స్ కూడా తీసుకున్నాను. ఆ పాయింట్స్ అన్ని బాగా ఉపయోగ పడ్డాయి సబ్జెట్ విషయంలో మనం కన్వీన్స్ చేస్తే ఆయనంత స్వీట్ పర్సన్ ఉండరు. నయనతార గారిని నేనే ఒప్పించాను. ప్రమోషన్స్ వీడియోస్ నుంచే ఆడియెన్స్ కి మూవీపై పాజిటివ్ ఏర్పడిందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |