![]() |
![]() |

సినిమా పేరు: భర్త మహాశయులకు విజ్ఞప్తి
నటీనటులు: రవితేజ, ఆషికా రంగనాధ్, డింపుల్ హయతి, సునీల్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: భీమ్స్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్:శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
రిలీజ్ డేట్ : జనవరి 13 ,2025
తన ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడని మాస్ మహారాజా రవితేజ(Raviteja)రెగ్యులర్ మాస్ స్టైల్ ని కొంచం తగ్గించి ఈ రోజు 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi)అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. ప్రచార చిత్రాలు బాగుండటం, సంక్రాంతికి తగ్గేదేలే అంటు రావడంతో మూవీపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
రామ్ సత్యనారాయణ అలియాస్ రామ్( రవితేజ) వైన్ ని తయారు చేసే విన్ యార్డ్ అనే సంస్థకి సిఈఓ. భార్య పేరు బాలామణి( డింపుల్ హయతి) సదరు సంస్థకి ఎండి. తన భర్త వేరే ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూడడనే చాలా బలమైన నమ్మకంతో ఉంటుంది. ఆమె నమ్మకానికి తగ్గట్టే రామ్ ఉండటంతో పాటు ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. మానస శెట్టి( ఆషికా రంగనాధ్) స్పెయిన్ దేశంలో వైన్ ని కొనుగోలు చేసి అంతర్జాతీయంగా సప్లై చేసే యూనిటెడ్ స్పిరిట్ సంస్థకి ఎండి. చాలా ఫాస్ట్ గర్ల్ తో పాటు స్వతంత్ర భావాలు కలిగిన యువతీ. ఏ విషయాన్నీ అంత సీరియస్ గా తీసుకొని ఒక డిఫరెంట్ మైండ్ సెట్ మానస శెట్టి సొంతం. సత్య అనే అతన్ని ఇష్టపూర్వకంగానే శారీరకంగా కలిసి ఆ కలయికని మర్చిపోదామని సత్య కి చెప్తుంది. కానీ సత్య తనని మోసం చేసాడని ఇండియా వచ్చి రామ్ ,బాలామణి ని కలుస్తుంది. దీంతో రామ్ భయపడుతుంటాడు. సత్య కోసం మానస వస్తే రామ్ ఎందుకు భయపడుతున్నాడు? సత్య ఎవరు? రామ్,సత్య కి ఉన్న సంబంధం ఏంటి? ఇష్టపూర్వకంగానే శారీరకంగా కలిసిన మానస ఎందుకు సత్య కోసం వచ్చింది? సత్య చేసిన మోసం ఏంటి? సునీల్, సత్య,వెన్నెల కిషోర్ పోషించిన క్యారెక్టర్స్ ని రామ్, సత్య, మానస, బాలామణి క్యారెక్టర్స్ కి సంబంధం ఏంటి? అసలు భర్త మహాశయులకు విజ్ఞప్తి అని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు అనేదే ఈ చిత్ర కథ .
ఎనాలసిస్
సినిమా ప్రారంభంలో వచ్చిన సాంగ్ తో పాటు మొదటి పావుగంట రన్నింగ్ చూస్తుంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి ఏదో తేడా కొడుతుందని అనిపిస్తుంది. కానీ సినిమాలోకి వెళ్లే కొద్దీ క్యారెక్టర్స్ యొక్క క్యారక్టరైజేషన్స్ ని క్లియర్ గా ప్రెజెంట్ చేయడంతో పాటు లాస్ట్ మినిట్ వరకు డైలాగ్స్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. దీంతో ఎంటర్ టైన్ మెంట్ ఒక రేంజ్ లోనే పండింది .ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ప్రారంభంలో వచ్చిన సాంగ్ తో పాటు మానస శెట్టి, సత్య పై వచ్చిన సీన్స్ రొటీన్. విందా (సత్య) కామెడీ అయితే కొంచం ఎబ్బెట్టుగా ఉంది. ,మానస, సత్య శారీరకంగా కలిసిన తర్వాత మానస చెప్పే మాటలతో కథ పై క్యూరియాసిటీ ఏర్పడింది. కానీ మానస విషయంలో సత్య భయపడుతు ఉండటమే అంత సూటబుల్ గా అనిపించదు.
సుదర్శన్(సునీల్) లీల(వెన్నెల కిషోర్) సత్య మధ్య వచ్చిన కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ చూసుకుంటే భారీగా ఎలివేట్ అయ్యే సీన్స్ కాకపోయినా, క్యారెక్టర్స్ ని ఓన్ చేసుకున్నాం కాబట్టి సత్య, మానస శెట్టి, బాలామణి,సుదర్శన్, లీల మధ్య కథనం నడిచిన విధానం, డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా మానస విషయంలో బాలామణి తో రామ్ నిజం చెప్పే సీన్ తో పాటు ఫస్ట్ హాఫ్ లో మానస తో సత్య తాను దాచిన నిజాన్ని చెప్పే సీన్ హైలెట్. మానస బ్రదర్ క్యారక్టర్ ని ని కథ లోకి తీసుకురావడం సినిమా రన్ కోసం అని ఈజీగా అర్ధమవుతుంది.
ఆ ప్లేస్ లో కన్ఫ్యూజ్ డ్రామాని క్రియేట్ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా మేకర్స్ చెయ్యలేదు. ఫ్లాట్ స్క్రీన్ ప్లే పైనే వెళ్లిపోయారు. సైక్రియా టిస్ట్ కమల్ హాసన్ నాయుడు( మురళీధర్ గౌడ్) కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వెరైటీ గా ఉన్నాయి. సాంగ్స్ బాగానే ఉన్నాయి.
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
రామ్, సత్య క్యారక్టర్ ల లో రవితేజ నటించాడు అనే కంటే జీవించాడని చెప్పవచ్చు. అంతలా పర్ఫెక్ట్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించి మూవీకి ప్రధాన బలంగా నిలిచాడు. కామెడీ టైమింగ్ లో కూడా తనలో జోష్ తగ్గలేదని చెప్పినట్లయింది. ఆషికా రంగనాధ్(Ashika Ranganath)అయితే గ్లామర్ గా కనపడి మెస్మరైజ్ చేయడంతో పాటు యాక్టింగ్ విషయంలోను అంతే గ్లామర్ గా చేసింది. మానస శెట్టి అనే క్యారక్టర్ లో ఒదిగిపోయిందని చెప్పవచ్చు. డింపుల్ హయతి(Dimple hayathi)పెర్ ఫార్మెన్స్ బాగున్నా తాను కాకుండా మరో నటి అయితే బాగుండేదేమో.సునీల్, వెన్నెల కిషోర్, మురళి ధర్ గౌడ్, సత్య మరో సారి పోటాపోటీగా అత్యద్భుతమైన కామెడీ టైమింగ్ తో మెస్మరైజ్ చేసారు. ముఖ్యంగా సునీల్ కామెడీ టైమింగ్ లో పాత సునీల్ కనిపించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువలు సో సో గానే ఉన్నాయి. ప్రసాద్ మూరెళ్ళ ఫొటోగ్రఫీ కూడా అంతే. నార్మల్ గా ఉంది. కిషోర్ తిరుమల(kishore Tirumala)దర్శకత్వంలో మెరుపులు ఏం లేవు. డైలాగ్స్ మాత్రం సూపర్. భీమ్స్(Bheems)అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే రొటీన్ సబ్జెట్ అయినా రవితేజ తో పాటు మిగతా నటీనటులకి సంబంధించిన క్యారక్టరయిజేషన్స్ వర్క్ అవుట్ కావడంతో కామెడీ ఒక మోస్తరుగానే పేలింది. ముఖ్యంగా డైలాగ్స్ సూపర్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నా కూడా సెకండ్ హాఫ్ పై మరింత శ్రద్ద చూపించాల్సింది.
రేటింగ్ 2 .5 / 5 అరుణాచలం
![]() |
![]() |