![]() |
![]() |

కొరటాల శివ.... ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి -మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య చిత్రంతో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నారు. ఆయన సినిమాపై శ్రద్ధ పెట్టకుండా కథా కథనాల గురించి పట్టించుకోకుండా బిజినెస్, నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్నారు. కానీ రాజమౌళితో సినిమా చేస్తే వెంటనే ఒక డిజాస్టర్ అనేది ఆయన కెరీర్ లో ఇప్పటికే అనేక సార్లు చవిచూశారు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ చిత్రాల తర్వాత వచ్చిన చిత్రాలు డిజాస్టర్ కావడం గమనార్హం. మరి ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత కొరటాల శివకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ బ్యాడ్ సెంటిమెంట్ వారిని బాగా వేధిస్తోందని, ఏదో మూల వారికి ఇబ్బంది కలిగిస్తుందని, మానసికంగా వారికి ఇబ్బందులు కలుగజేస్తోందని భావిస్తున్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ అయ్యి ఏడాది అవుతుంది. ఇప్పటివరకు తారక్ నెక్స్ట్ సినిమా సెక్స్ పైకి తీసుకు వెళ్ళలేదు. దీనికి కారణం కొరటాల శివ అంటున్నారు. ఆచార్య డిజాస్టర్ రిజల్ట్ తో కోరటాల శివ మానసికంగా బాగా ఇబ్బంది పడ్డాడట. చిరంజీవి ఆచార్య డిజాస్టర్ ను దృష్టిలో ఉంచుకొని పరోక్షంగా కొరటాలను నిందిస్తూనే ఉన్నాడని ఆయన లోలోన కుమిలిపోతున్నాడని సమాచారం. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో కూడా చిరు కొరటాలను ఇండైరెక్టుగా టార్గెట్ చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వెలువెత్తుతున్నాయి. అయినా కూడా శివా మీద ఉన్న నమ్మకంతో ఎన్టీఆర్ తన నిర్ణయం మార్చుకోలేదు. ఆర్ ఆర్ ఆర్ చిత్రం సమయంలో మాటిచ్చినట్లుగా కొరటాలశివపై అదే మాటకు కట్టుబడ్డారు. కొరటాల మీద ఎన్టీఆర్ నమ్మకం ఉంచారు. స్క్రిప్ట్ విషయంలో మాత్రం కొరటాలకి చాలా కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. బౌండ్ స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసిన తర్వాతనే సెట్స్ పైకి వెళ్దామని సూచించారట. దాంతో కొరటాల ఎక్కువ సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకి సంగీత దర్శకునిగా అనిరుధ్‌ని ఫిక్స్ చేశారు. అనిరుద్ కి కూడా ఇప్పటివరకు తెలుగులో సరైన హిట్ లేదు. అయినా కూడా మరో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్‌ని ఎంచుకున్నారు. ఆయనలోని టాలెంట్‌ను చూసి ఫిక్స్ చేసేసారు. ఆర్ట్ డైరెక్టర్ ని కూడా ఫైనల్ చేశారు. ఇందులో తారక్ మత్స్యకారుడిగా నటించనున్నాడట. వీరిని చాలా చోటా పల్లె కాపులు అంటారు. దీనికి తగ్గట్టుగా సెట్స్ ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా సిద్ధం కావడంతో క్యాస్టింగ్ కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వి కపూర్ ని ఎంపిక దాదాపు ఫైనల్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభించి ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
![]() |
![]() |