![]() |
![]() |

అన్నీ ఉన్న ఆకు అణిగిమణి గి ఉంటుంది.... ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది అనేది పెద్ద సామెత. ఇక అన్ని ఉన్నప్పుడు కూడా సాధారణంగా ఉండడం వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న సమానంగా స్వీకరించడం ఆధ్యాత్మికకు చిహ్నం. అలా ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండేవారు స్థిర ప్రజ్ఞులు. ఇక విషయానికి వస్తే గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ ఫ్లాప్ లతో అల్లాడిపోయిన బుట్ట బొమ్మ పూజా హెగ్డే పరిస్థితి ఇలాగే ఉంది అనిపిస్తోంది. 2022లో ఈమె నటించిన చిత్రాలు వరుస డిజాస్టర్స్ గా మిగిలాయి.
ప్రభాస్ రాధేశ్యాం, విజయ్ బీస్ట్, రన్వీర్ సింగ్ సర్కస్ పెద్ద ఫ్లాపులుగా మిగిలాయి. ఈ ఫ్లాఫ్ లతో పూజ కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మహేష్ 28వ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఒకే ఏడాది ఇలాంటి భారీ ఫ్లాప్ లు నిరాశపరచడంతో ప్రస్తుతం రాహు పూజలు, కుజదోషం పైన, రాహుకేతువుల పైన దృష్టి సారించింది. అరవింద సమేత వీర రాఘవ, అలా వైకుంఠపురం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ సలహాను తూచా తప్పకుండా పాటిస్తోందట. ఈ దోషాలు పోవాలంటే ప్రత్యేక పూజలు ఆచరించాలని దానధర్మాలు చేయాలని త్రివిక్రమ్ ఆమెకు సలహా చెప్పాడని సమాచారం.
దీంతో పూజలు, గుడుల చుట్టూ తిరుగుతోంది. తనకు తోచిన దాన ధర్మాలు చేస్తోంది. ఇటీవల ఎంతో నిష్టగా ఉంటుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడి వద్ద పూజలు చేస్తూ కనిపించింది. మొత్తానికి రాహుకేతు పూజలు కుజ దోష నివారణ పూజలతో అమ్మడు పూర్వ వైభవం సాధిస్తానని నమ్మకంతో ఉంది. అవి తప్పకుండా పని చేస్తాయి. అమ్మవారిని పూజిస్తే అవన్నీ తొలగిపోతాయని గురూజీ సలహా ఇచ్చాడట.
గతంలో అనుష్క నయనతారాలు సైతం శ్రీకాళహస్తికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకుని వచ్చారు. విరాట్ కోహ్లీ అనుష్క నుంచి ఎందరో శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలను జరిపించిన వారే కావడం విశేషం. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా తమకు రాహుకేతు సమస్యలు ఉన్నాయంటే వెంటనే శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమైపోతారు. మొత్తానికి ఎంత ఎగిరి పడిన ఏదో ఒక రోజు సమస్యలు అనేవి కచ్చితంగా వస్తాయి. ఎవరికైనా చివరికి ఆ దేవుడే దిక్కు అని తెలుసుకోవడమే మానవధర్మం.
![]() |
![]() |