![]() |
![]() |

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'విట్ నెస్', 'సాల' వంటి చిత్రాలను నిర్మించడం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అక్కడా కూడా తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు 'వడక్కుపట్టి రామసామి' పేరుతో తమిళంలో మూడో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రం కోసం 'డిక్కిలోన'తో బ్లాక్ బస్టర్ జోడీగా పేరు తెచ్చుకున్న నటుడు సంతానం, దర్శకుడు కార్తీక్ యోగితో చేతులు కలపడం విశేషం. తాజాగా ఈ చిత్ర ప్రకటన అధికారికంగా వచ్చింది.
సంతానం ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కథానాయికను ఖరారు చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో జాన్ విజయ్, ఎంఎస్ భాస్కర్, రవి మరియ, మారన్, మొట్టా రాజేంద్రన్, నిజల్గల్ రవి, శేషు, ప్రశాంత్, జాక్వెలిన్ తదితరులు నటించనున్నారు. సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'విట్ నెస్' చిత్రంతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న దీపక్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్ గా శివ నందీశ్వరన్, ఆర్ట్ డైరెక్టర్ గా రాజేష్, కొరియోగ్రాఫర్ గా షరీఫ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
తాజాగా టైటిల్ తో కూడిన ప్రచారచిత్రం విడుదల చేసిన నిర్మాతలు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం షూటింగ్ ఈరోజు(జనవరి 24న) ప్రారంభం కానుంది అని తెలిపారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పీరియడ్ కామెడీ-డ్రామాగా తెరకెక్కనున్న 'వడకుపట్టి రామసామి' అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
![]() |
![]() |