![]() |
![]() |

మూవీ: డ్రైవర్ జమున
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: కిన్ స్లిన్.
తారాగణం: ఐశ్వర్య రాజేశ్, ఆడుకలమ్ నరేన్, శ్రీరంజని, 'రాజారాణి' పాండియన్, కవితా భారతి, రిషబ్, వైభవ్ గోహిల్.
నిర్మాతలు : ఎస్ పి చౌదరి, M. ఇళమైదాస్, 'కింబర్లీ' సెంథిల్.
పాటలు: A శ్రీనివాస మూర్తి
ఆర్ట్: డాన్ బాలా
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనాయ్
ఎడిటింగ్: R రామర్
ఓటిటి : ఆహా
చిన్న సినిమాలైనా కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రేక్షకులలో కొంతమంది క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ని ఇష్టపడితే మరికొందరు సస్పెన్స్ ని ఇష్టపడతారు. అలాంటిది సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఈ మూడు జోనర్స్ ని కలిపి 'డ్రైవర్ జమున' గా తీర్చిదిద్దాడు డైరెక్టర్.
కథ:
ఒక క్యాబ్ డ్రైవర్ గా జమున పరిచయం మొదలవుతుంది. జమున తల్లి వీల్ చైర్ పై ఉంటుంది. తమ్ముడు ఎక్కడో దూరంగా ఉంటాడు. నాన్న హత్య చేయబడతాడు. ఇక కుటుంబ బాధ్యత జమున మీద పడుతుంది. దీంతో తను వాళ్ళ నాన్న క్యాబ్ ని నడిపిస్తూ వాళ్ళ కుటుంబ బాధ్యతలు తీసుకుంటుంది. అయితే ఒకరోజు జమున క్యాబ్ ని ముగ్గురు క్రిమినల్స్ రైడ్ బుక్ చేసుకుంటారు.
అయితే మొదట వాళ్ళని చూసి అనుమానపడిన జమున .. ఇక్కడ నుండి అంత దూరం రావడం కుదరదు అని వెళ్ళిపోతుండగా... చాలా అర్జెంటుగా ఒక పెళ్ళికి వెళ్ళాలి అక్కా అంటూ ఒక క్రిమినల్ వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు. ఇక చేసేదేమి లేక వాళ్ళని తీసుకొని బయల్దేరుతుంది. అయితే దారిలో జమునకి వాళ్ళు క్రిమినల్స్ అని తెలుస్తుంది.
ఆ ముగ్గురు క్రిమినల్స్ ఆ ఊళ్ళొ మంచివాడుగా చలామణీ అవుతున్న MLA వెంకట్రావ్ ని చంపడానికి వెళ్తున్నట్డు కనిపెడుతుంది జమున. అయితే వీరి నుండి వెంకట్రావ్ ని సేవ్ చెయ్యాలని భావిస్తుంది జమున. అయితే జమున కార్ లో ఉన్న ముగ్గురూ కూడా క్రిమినల్స్ అని పోలీసులకు అసలు నిజం తెలిసిపోతుంది. "నేను ACP ని మాట్లాడుతున్నాను. నువ్వు ఏం భయపడకు.. మేం నీ కార్ ని ఫాలో అవుతున్నాం" అంటూ జమునకి చెప్తారు. అలా ఫోన్ లో చెప్తుండగా సడన్ గా లౌడ్ స్పీకర్ ప్రెస్ అవుతుంది. దీంతో పోలీస్ చెప్పిన ప్లాన్ అంతా ఆ కార్ లో ఉన్న క్రిమినల్స్ కి తెలిసిపోతుంది.
ఇక ఆ క్రిమినల్స్ పోలీసుల నుండి ఎలా తప్పించుకున్నారు? డ్రైవర్ జమున ప్రాణాలతో బయటపడిందా? మద్దెల వెంకట్రావ్ ని ఆ క్రిమినల్స్ చంపగలిగారా? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో మొదట జమునని కుటుంబానికి అండగా నిలిచిన ఒక అమ్మాయి పాత్రలో చూపించి... ఆ తర్వాత క్రిమినల్స్ నుండి తప్పించుకునే సీన్స్ తో ఆసక్తిని కలిగించిన డైరెక్టర్... క్లైమాక్స్ అసలు ఎవరూ ఊహించని ట్విస్ట్ తో తన మార్క్ ని చాటుకున్నాడు. జమున తమ్ముడి క్యారెక్టర్ ని బెస్ట్ సపోర్టింగ్ రోల్ గా మలిచిన తీరు బాగుంది. గోకుల్ బెనాయ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. జిబ్రాన్ సంగీతం పర్వాలేదనిపించింది. రామర్ ఎడిటింగ్ బాగుంది. 'రాజారాణి' పాండియన్ మంచి సపోర్టింగ్ రోల్ చేసాడు. మూవీ స్టాటింగ్ లో కాస్త స్లోగా కథలోకి వెళ్ళినా కూడా ఇంటర్వెల్ కి వచ్చే ట్విస్ట్.. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి.
నటీనటుల పనితీరు:
డ్రైవర్ జమున పాత్రలో కుటుంబ బాధ్యతలు తీసుకునే ఇంటి పెద్దగా... ఇంకా క్రిమినల్స్ కి ఎదురునిలబడి ధైర్యంగా పోరాడే సీన్స్ లో ధైర్యవంతురాలిగా తన మార్క్ చాటుకుంది ఐశ్వర్య రాజేష్. మాజీ MLA గా మద్దెల వెంక్రాటావ్ ఆకట్టుకున్నాడు. డబ్బులు ఇస్తే ఎవరినైనా చంపేస్తాం అన్నట్టుగా సీరియల్ కిల్లర్స్ యాక్టింగ్ బాగుంది.
తెలుగువన్ పర్స్ పెక్టివ్:
కిరాయి హంతకుల నుండి ఒంటరి ఆడది ఎలా బయటపడాలో... ఎలా వారిని ధైర్యంగా ఎదుర్కోవాలో చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్స్ ను ఇష్టపడేవాళ్ళు ఈ సినిమాని ఓసారి చూడొచ్చు.
రేటింగ్: 2.5 /5
✍🏻. దాసరి మల్లేశ్
![]() |
![]() |