యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు, నిర్మాత మాత్రమే అల్లు అర్జున్ దగ్గరకు వచ్చాడా? ఎన్టీఆర్తో చేయాలనుకున్న కథ కూడా వచ్చిందా? అల్లు అర్జున్21 సినిమాతో ఫిలింనగర్ సర్కిల్లో కొత్త సందేహాలు పుట్టుకొచ్చాయి. ఎందుకు? ఏమిటి? అని అసలు వివరాల్లోకి వెళితే...
అల్లు అర్జున్, కొరటాల శివ సినిమాతో మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా పరిచయమవున్నారు. యువసుధా ఆర్ట్స్ పతాకంపై ఆయన ఈ సినిమా నిర్మిస్తున్నారు. దర్శకుడు కొరటాలకు మిక్కిలినేని మంచి స్నేహితుడు. అయితే, స్నేహితుడిని నిర్మాతగా పరిచయం చేస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కొరటాల ఒక సినిమా తీయాలని అనుకున్నారు. యువసుధా ఆర్ట్స్ బ్యానర్ నుండి ఎన్టీఆర్కి బర్త్డే విషెస్ చెబుతూ ఒకసారి ప్రొడక్షన్ నెంబర్ 1 అని సినిమా కూడా అనౌన్స్ చేశారు. కట్ చేస్తే, ఇప్పుడు ఎన్టీఆర్ లేడు. సీన్లోకి అల్లు అర్జున్ వచ్చారు. డైరెక్టర్ కొరటాల శివ, ప్రొడ్యూసర్ మిక్కిలినేని సుధాకర్ సేమ్. దాంతో సినిమా జనాలకు డౌట్ వచ్చింది. ఎన్టీఆర్ దర్శక, నిర్మాతలు మాత్రమే ఇటు వచ్చారా? కథ కూడా వచ్చిందా? అని.
గతంలో ఎన్టీఆర్ సినిమాతో రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ కావాలని అనుకున్నాడు. కథ చెప్పాడు. కొన్ని రోజులు డిస్కషన్లు నడిచాయి. కట్ చేస్తే... అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.