సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి ఐశ్వర్య అయితే రెండో అమ్మాయి సౌందర్య. హీరో ధనుష్‌ను పెళ్లాడిన ఐశ్వర్యకు ఇద్దరు కొడుకులైతే, సౌందర్యకు ఒక్క కొడుకు. సౌందర్య డైరెక్టర్ కూడా కొచ్చాడయాన్, విఐపి 2 సినిమాలను ఆమె డైరెక్ట్ చేసింది. ఇటీవల తనకొడుకుకు వేద్ అనే పేరు ఎందుకు పెట్టారనే విషయంతో పాటు పలు సొంత విషయాలను ఆమె పంచుకుంది. అవేమిటంటే...
* మా అక్క పిల్లలకు యాత్రా, లింగా అనే పేర్లు మా నాన్నగారే పెట్టారు. నా కొడుక్కి మాత్రం వేద్ అనే పేరు నేనే పెట్టా. ఎందుకంటే పేరు విషయంలో నేను ముందు నుంచీ చాలా పర్టిక్యులర్‌గా ఉన్నా. మామూలుగా పెద్ద పేరు ఉన్నవారిని ఎవరూ పూర్తి పేరుతో పిలవరు. షార్ట్ చేసి పిలుస్తుంటారు. నేను పెట్టే పేరును ఎవరూ షార్ట్ చేసి పిలవకూడదనేది నా ఫీలింగ్. అందుకే పేరు గురించి చాలా ఆలోచించి ఆ పేరు పెట్టాను. నాకు వేదం, వేదాంతం అనే పదాలు ఇష్టం.. అందుకే వేద్ అని పెట్టాను.
* నా స్ట్రెస్ బస్టర్ నా కొడుకే. తన చేష్టలు, తన మాటలు, తన పరుగులు.. ప్రతిదీ నా స్ట్రెస్ బస్టరే.
* మా అబ్బాయి నా జీవితంలోకి వచ్చే దాకా అందరూ నన్ను చిన్నబిడ్డలా ట్రీట్ చేసేవాళ్లు. కానీ కొడుకు పుట్టాక నాలోనూ పెద్దరికం వచ్చింది. కాబట్టి మదర్‌హుడ్ అనేది చాలా మంచి ఫీలింగ్. తల్లి స్థానాన్ని ప్రేమిస్తున్నా. ఓపిక అలవాటైంది.
* మా అబ్బాయిపై మా అమ్మ తీసుకునే కేర్ చూస్తుంటే.. మమ్మల్ని ఇంకెంత జాగ్రత్తగా పెంచి ఉంటారో అర్థమవుతూ ఉంది. నేను ఒక కొడుకుకు తల్లిని. ఇప్పుడు మా అమ్మ ముగ్గురు అబ్బాయిలకు అమ్మమ్మ. యాత్రా, లింగా, వేదా.. ముగ్గురినీ చాలా బాగా మేనేజ్ చేస్తుంటుంది.
* అక్క ఐశ్వర్య చాలా బిజీ. ఇద్దరు పిల్లలు, వాళ్ల చదువులు. అవి కాకుండా వాళ్ల ప్రాజెక్టులు.. చాలానే చేస్తుంటుంది. అప్పుడప్పుడు మా దగ్గరకు వస్తుంటుంది. అక్క వస్తే తప్పకుండా నేను టైమ్ అడ్జస్ట్ చేసుకుని ఇంట్లో ఉంటా. ఏవేవో కబుర్లు సరదాగా చెప్పుకుంటాం.