మంచిమంచి సాంగ్స్ పాడి అలరిస్తూనే ఎంతో మంది ఫాన్స్ ని సొంతం చేసుకున్న సునీత ఉపద్రష్ట మరో కొత్త అడుగు వేయడానికి రెడీ అయ్యారు. సునీత పాటలు పాడటమే కాదు ఎంతోమందికి గాత్ర దానం కూడా చేశారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే సునీత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. ఐతే ప్రస్తుతం ఒక సినిమాలో యాక్ట్ చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అది కూడా స్టార్ హీరో మహేష్ బాబుతో కలిసి. సునీతను నటిగా పరిచయం చేస్తోంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అని సమాచారం.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఆయన ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఐతే రీసెంట్ గా మహేష్ బాబు ఇంట్లో జరిగిన వరుస మరణాల కారణంగా ఈ మూవీకి కొంచెం బ్రేక్ పడింది. ఐతే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. SSMB 28 అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీలో మహేష్ బాబుకు అక్క పాత్రలో సునీత నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఐతే డైరెక్టర్ త్రివిక్రమ్ ఆమెను కలిసి మాట్లాడగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐతే ఇది నిజమా ..కాదా అనే విషయం తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.