![]() |
![]() |

``అట్లుంటది మనతోని`` అంటూ `డీజే టిల్లు`తో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. కాగా, త్వరలో ఈ టాలెంటెడ్ స్టార్ ఓ బడా ప్రాజెక్ట్ లో భాగం కానున్నాడట.
ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో బాలయ్య కనిపించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో ఎంటర్టైనింగ్ గా సాగే ఓ స్పెషల్ రోల్ ఉందట. అందులో.. సిద్ధు జొన్నలగడ్డ వినోదాలు పంచనున్నాడని టాక్. త్వరలోనే బాలయ్య - అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. బాలయ్య లాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న సిద్ధు.. సదరు స్పెషల్ రోల్ తో ఎలాంటి గుర్తింపు ని పొందుతాడో చూడాలి.
ఇదిలా ఉంటే, బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి వచ్చే అవకాశముంది. అదయ్యాకే, అనిల్ రావిపూడి కాంబినేషన్ వెంచర్ పట్టాలెక్కనుంది.
![]() |
![]() |