![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా `సర్కారు వారి పాట`. మూడు వరుస విజయాలు (భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు) అందుకున్నాక మహేశ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో.. ట్రేడ్, పరిశ్రమ వర్గాలు కూడా `సర్కారు వారి పాట` విడుదల కోసం ఎంతో ఆసక్తిగా వేచిచూస్తున్నాయి.
కాగా, వేసవి కానుకగా మే 12న `సర్కారు వారి పాట` రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో.. అందరి చూపు కూడా ట్రైలర్ అనౌన్స్ మెంట్ వైపే ఉంది. ఆ నిరీక్షణకి తగ్గట్టుగానే అతి త్వరలో ట్రైలర్ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ కూడా ప్రకటించారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `పోకిరి` (2006) విడుదల తేది అయిన ఏప్రిల్ 28న `సర్కారు వారి పాట` ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారట. అదే గనుక నిజమైతే.. మహేశ్ అభిమానులకు ఇది మరింత ఆనందాన్నిచ్చే అంశమనే చెప్పాలి.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `పోకిరి`కి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెప్టెన్ కాగా.. `సర్కారు వారి పాట`ని పూరి శిష్యుడు పరశురామ్ రూపొందించాడు. మరి.. `పోకిరి`లాగే `సర్కారు వారి పాట` కూడా బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
![]() |
![]() |