సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న 'శాకుంతలం' చిత్రంతో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ప్రిన్స్ భరత పాత్రలో అలరించనుంది. ఇదిలా ఉంటే అర్హ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు తన 28వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'అతడు', 'ఖలేజా' తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇందులో సినిమాకి ఎంతో కీలకమైన ఒక పాప పాత్ర ఉందట. ఆ పాత్రకి అర్హ సరిగ్గా సరిపోతుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్, బన్నీ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇప్పటిదాకా వారి కలయికలో మూడు సినిమాలు రాగా.. మూడూ విజయాలు సాధించాయి. త్వరలో నాలుగో సినిమా కూడా చేసే అవకాశముంది. త్రివిక్రమ్ తో ఉన్న బాండింగ్ దృష్ట్యా ఆయన అడగ్గానే బన్నీ ఏమాత్రం ఆలోచించకుండా.. తన కూతుర్ని 'ఎస్ఎస్ఎంబి 28'లో నటింప చేయడానికి ఓకే చెప్పినట్లు న్యూస్ వినిపిస్తోంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.