హైపర్ ఆది ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్ మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నాడు. అవకాశాల కోసం అన్వేషిస్తూ వచ్చిన వాటిని యూజ్ చేసుకుంటున్నాడు. ఐతే ఇప్పుడు ఆదికి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ "హరి హర వీర మల్లు" గురించి ఇంటరెస్టింగ్ టాపిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇంతటి భారీ రేంజ్ మూవీకి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది డైలాగ్స్ రాసాడట..టైమింగ్ తో కూడిన పంచులు జబర్దస్త్ లో ఎలా పేలేవో అందరికీ తెలిసిన విషయమే.
ఆల్రెడీ ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.. అందులోనూ ఆయన నటించే మూవీలో కామెడీ బిట్స్ రాసే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాడు. ఐతే ఈ మూవీలో డైలాగ్స్ బుర్ర సాయి మాధవ్ రాశారు. కానీ కొన్ని కామెడీ సీన్స్ ఉండేసరికి వాటికి హైపర్ ఆది సాయం తీసుకున్నారట డైరెక్టర్ క్రిష్. ఇక ఈ మూవీని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీని తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మొగలుల కాలం నాటి బందిపోటు వీరుడి కథగా హరి హర వీరమల్లు రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ ఐన ఈ మూవీ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ రిలీజ్ అయ్యాక హైపర్ ఆది కామెడీ డైలాగ్స్ పవర్ ఫుల్ గా పేలితే మాత్రం అతనికి బిగ్ బ్రేక్ వచ్చినట్టే. ఇక మిగతా డైరెక్టర్స్ కూడా ఆది కోసం క్యూ కట్టే అవకాశం ఉందని దీని బట్టి తెలుస్తోంది.