మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో 'పుష్ప' ఫ్రాంచైజ్ నుంచి రెండో భాగంగా రానున్న 'పుష్ప: ది రూల్' ఒకటి. 2021 డిసెంబర్ లో 'పుష్ప: ది రైజ్' పేరుతో విడుదలైన మొదటి భాగం పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయం సాధించడంతో.. 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'వేర్ ఈజ్ పుష్ప' పేరుతో ఇప్పటికే విడుదల చేసిన 'పుష్ప-2' కాన్సెప్ట్ టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు 'పుష్ప'కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడో భాగం కూడా రానుందట.
'పుష్ప-1'లో పుష్ప రాజ్ అనే ఒక కూలి ఎర్రచందనం స్మగ్లర్ గా ఆ సిండికేట్ ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడని చూపించారు. అలాగే రెండో భాగంలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ తో పోరు ఉంటుందని తెలిపేలా మొదటి భాగాన్ని చూపించారు. అయితే 'పుష్ప-2'లో పుష్పరాజ్, షెకావత్ ల మధ్య పోరు మాత్రమే కాకుండా.. ఇంటర్నేషనల్ రేంజ్ స్మగ్లర్ల ఎంట్రీ ఉంటుందట. వారికి, పుష్పరాజ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో పవర్ ఫుల్ గా ఉంటాయట. రెండో భాగంలో పుష్ప ఇంటర్నేషనల్ స్మగ్లర్ రేంజ్ కి ఎదిగాడని చూపుతూ, మూడో భాగానికి లీడ్ ఇస్తారట.
ప్రస్తుతం 'పుష్ప-2'తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ తర్వాత 'పుష్ప-3' పట్టాలెక్కే అవకాశముంది అంటున్నారు.