![]() |
![]() |

`చిత్రలహరి` (2019), `ప్రతి రోజూ పండగే` (2019), `సోలో బ్రతుకే సో బెటర్` (2020)తో వరుస విజయాలను అందుకున్న `సుప్రీమ్` హీరో సాయితేజ్ కి.. ఆపై వచ్చిన `రిపబ్లిక్` (2021) ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో.. రాబోయే సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు ఈ యువ కథానాయకుడు. కాగా, ఈ చిత్రం ఓ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందనుందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేయనున్నారు. సాయితేజ్ కెరీర్ లో 15వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ.. బ్లాక్ మ్యాజిక్ (చేతబడి) నేపథ్యంలో తెరకెక్కనుందట. చేతబడుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఓ గ్రామాన్ని.. ఆ ఊరికి ఇంజినీర్ గా వచ్చే కథానాయకుడు ఎలా కాపాడాడు? అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్ అని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. బహుశా, ఇదే ఏడాది చివరలో ఈ చిత్రం జనం ముందుకు వచ్చే అవకాశముంది.
![]() |
![]() |