![]() |
![]() |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం `గీత గోవిందం` (2018). ఆ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ తో యువ సామ్రాట్ నాగచైతన్య త్వరలో ఓ మూవీ చేయబోతున్నాడు. 14 రీల్స్ ప్లస్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి `నాగేశ్వర రావు` అనే టైటిల్ ప్రముఖంగా వినిపిస్తోంది.
కట్ చేస్తే.. పరశురామ్ తో పాటు మరో విజయ్ దేవరకొండ దర్శకుడితోనూ చైతూ జట్టుకట్టనున్నాడట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. విజయ్ కి `పెళ్ళి చూపులు` (2016) రూపంలో హీరోగా తొలి విజయాన్ని అందించిన యంగ్ అండ్ టాలెంటెడ్ కెప్టెన్ తరుణ్ భాస్కర్. ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల నాగచైతన్యని సంప్రదించి తరుణ్ భాస్కర్ ఓ ఆసక్తికరమైన కథ వినిపించారట. అది నచ్చడంతో.. చైతూ కూడా వెంటనే ఓకే చెప్పాడని టాక్. అంతేకాదు.. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై చైతూ మేనమామ డి. సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చెప్పుకుంటున్నారు. అలాగే, ఇందులో ఇప్పటివరకు పోషించని పాత్రలో నాగచైతన్య దర్శనమిస్తాడని బజ్. త్వరలోనే నాగచైతన్య - తరుణ్ భాస్కర్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే, నాగచైతన్య తాజా చిత్రం `థాంక్ యూ` జూలై 8న రిలీజ్ కానుంది. అలాగే, స్పెషల్ రోల్ లో నటించిన హిందీ చిత్రం `లాల్ సింగ్ చద్ధా` ఆగస్టు 11న తెరపైకి వస్తోంది. మరోవైపు.. `దూత` అనే వెబ్ - సిరీస్ లో నటిస్తున్న చైతూ.. వెంకట్ ప్రభు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు.
![]() |
![]() |