![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం గురించి ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది. ఎవరో ఒక డైరెక్టర్ పేరు తెర మీదకు రావడం, ఆ తర్వాత ఏ చప్పుడు లేకపోవడం కొన్నాళ్లుగా ఈ తంతు జరుగుతూ వస్తోంది. తాజాగా మరో క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు తెరమీదకు వచ్చింది.
మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతను బాలయ్య ఈ డైరెక్టర్ కే ఇచ్చాడంటూ ఇప్పటిదాకా ఎన్నో పేర్లు వినిపించాయి. వారిలో బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, క్రిష్ వంటి వారు ఉన్నారు. ఒకానొక సందర్భంలో 'ఆదిత్య 369'కు సీక్వెల్ గా తన దర్శకత్వంలో 'ఆదిత్య 999' చేస్తున్నానని.. ఆ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య అన్నారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ సమయంలో అసలు మోక్షజ్ఞకి సినిమాలంటే ఆసక్తి లేదని, అందుకే ఫిజిక్ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదని కూడా న్యూస్ వినిపించింది. ఈ న్యూస్ తో నందమూరి ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు.
అయితే తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మళ్ళీ వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయట. మోక్షజ్ఞ కూడా అందుకు తగిన శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ బాధ్యతను బాలయ్య అనిల్ రావిపూడికి ఇచ్చారని టాక్. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బాలయ్య తన తదుపరి సినిమా అనిల్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం స్టోరీ రెడీ చేయమని అనిల్ తో బాలయ్య చెప్పారట. బాలయ్యతో సినిమా పూర్తవ్వగానే అనిల్ మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కిస్తాడని ప్రచారం జరుగుతోంది.
![]() |
![]() |