![]() |
![]() |

`ఎఫ్ 2`, `ఎఫ్ 3` చిత్రాల్లో జంటగా అలరించారు సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. కట్ చేస్తే.. త్వరలో ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టనున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో వెంకీ కథానాయకుడిగా ఓ సినిమా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్. కాగా, ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నాని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. `ఎఫ్ 2`, `ఎఫ్ 3`లో కనువిందు చేసిన వెంకీ - తమన్నా జోడీ.. హ్యాట్రిక్ బాట పడుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, రానా దగ్గుబాటితో కలిసి వెంకీ నటించిన వెబ్ - సిరీస్ `రానా నాయుడు` త్వరలోనే స్ట్రీమ్ కానుంది. మరోవైపు.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం `కబీ ఈద్ కబీ దివాళి`లో ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారు వెంకటేశ్. ఇక తమన్నా విషయానికి వస్తే.. `గుర్తుందా శీతాకాలం` విడుదలకు సిద్ధం కాగా, `భోళా శంకర్` చిత్రీకరణ దశలో ఉంది. అలాగే, హిందీలో `బోలే చుడియాన్`, `ప్లాన్ ఎ ప్లాన్ బి`, `బబ్లీ బౌన్సర్` అనే సినిమాలు చేస్తోంది మిల్కీ బ్యూటీ.
![]() |
![]() |