'ధమాకా'తో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఆమె చేతిలో 'ssmb 28', 'nbk 108', 'నితిన్ 32', 'రామ్-బోయపాటి మూవీ' వంటి ఎన్నో ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసిందని న్యూస్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో 12వ సినిమాగా రానున్న ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోంది. ఈ చిత్రంలోలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
ప్రస్తుతం శ్రీలీల పేరు టాలీవుడ్ లో మారుమోగుతోంది. అతి కొద్ది సమయంలోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. అందుకే ఆమెకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. మరి ముందు ముందు ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.