‘అఖండ’ చిత్రంతో నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య 50 ఏళ్ళ తండ్రి పాత్రలో కనిపించనున్నారట. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. మరోవైపు హీరో రాజశేఖర్‌ను ఈ చిత్రంలోని మెయిన్ విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం.
కాగా ’గీతా గోవిందం, సర్కారు వారి పాట’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పరుశురామ్ బాలకృష్ణతో ఓ చిత్రానికి తీయబోతున్నారట. ఈ సినిమాలో బాలకృష్ణ సీఎం గా కనిపించబోతున్నాడట. బాలయ్య క్యారెక్టర్‌ను కూడా డైరెక్టర్ పరుశురామ్ చాలా పవర్ ఫుల్‌గా డిజైన్ చేశారట. ఇంతవరకు ఎప్పుడూ చూడని బాలకృష్ణను పరుశురామ్ ఈ చిత్రంలో చూపించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక బాలకృష్ణ ఒక పక్క మూవీస్‌తో పాటు మరో పక్క ఓటీటీలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ షోకి హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.