![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త చిత్రంలో ఓ శాండల్ వుడ్ స్టార్ సందడి చేయనున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ ఇన్ఫర్మేషన్.
ఆ వివరాల్లోకి వెళితే.. `అతడు` (2005), `ఖలేజా` (2010) వంటి క్లాసిక్స్ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేశ్ ముచ్చటగా మూడోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నది. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో సీనియర్ కన్నడ స్టార్ వి. రవిచంద్రన్ ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారట. అంతేకాదు.. అభినయానికి ఎంతో ఆస్కారమున్న వేషమిదని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, `#SSMB 28` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న మహేశ్ - త్రివిక్రమ్ థర్డ్ జాయింట్ వెంచర్ లో `బుట్టబొమ్మ` పూజా హెగ్డే కథానాయికగా ఎంటర్టైన్ చేయనుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందించనున్నాడు. 2023 ప్రథమార్ధంలో ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ తెర పైకి రానుంది.
![]() |
![]() |