![]() |
![]() |

గతేడాది చివర్లో 'అఖండ'తో ఘన విజయాన్ని అందుకొని నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న బాలయ్య.. తదుపరి సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయనున్నాడు. తాజాగా బాలయ్య 109వ సినిమాకి కూడా డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడని న్యూస్ వినిపిస్తోంది.
రచయితగా ఎన్నో హిట్స్ అందుకున్న బీవీఎస్ రవి డైరెక్టర్ గా మాత్రం హిట్ టేస్ట్ చూడలేదు. ఇప్పటిదాకా ఆయన డైరెక్షన్ లో 'వాంటెడ్'(2011), 'జవాన్'(2017) రాగా.. ఈ రెండు సినిమాలూ ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ దర్శకుడిగా తన మూడో సినిమా ఏకంగా బాలయ్యతో చేసే ఛాన్స్ దక్కించుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఓటీటీ వేదిక ఆహాలో 'అన్ స్టాపబుల్' షోతో బాలయ్య అలరించిన సంగతి తెలిసిందే. ఈ షో సూపర్ సక్సెస్ కావడమే కాకుండా బాలయ్యని మరింత మందికి చేరువ చేసింది. ఈ షోని డిజైన్ చేసింది బీవీఎస్ రవినే. షో సమయంలో బాలయ్యతో ఏర్పడిన సాన్నిహిత్యంతో రవి తాజాగా ఒక కథని వినిపించాడట. అది బాలయ్యకు నచ్చడంతో సినిమా చేయడానికి వెంటనే ఓకే చెప్పాడని టాక్.
ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. నిజంగానే బాలయ్యని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఆ సినిమాతోనైనా డైరెక్టర్ గా బీవీఎస్ రవి ఫస్ట్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |