![]() |
![]() |

1997లో `మాస్టర్`గా మురిపించారు మెగాస్టార్ చిరంజీవి. ఇక 2021లో అదే పేరుతో విడుదలైన తమిళ అనువాద చిత్రం `మాస్టర్`లో ప్రతినాయకుడిగా మెస్మరైజ్ చేశారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. కట్ చేస్తే.. నాటి `మాస్టర్` హీరోని నేటి `మాస్టర్` విలన్ ఢీ కొట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగా కాంపౌండ్ కి కలిసొచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ లో చిరంజీవి తొలిసారిగా ఓ సినిమా చేస్తున్నారు. `పవర్`, `జై లవ కుశ`, `వెంకిమామ` చిత్రాల దర్శకుడు బాబీ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మెగాస్టార్ కి జంటగా చెన్నై పొన్ను శ్రుతి హాసన్ నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారని సమాచారం. కాగా, ఇదే చిత్రంలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. చిరు `సైరా నరసింహారెడ్డి`లో ప్రత్యేక పాత్రలో ఆకట్టుకున్న విజయ్ సేతుపతి.. `మెగా 154`లో బ్యాడీగానూ ఎంటర్టైన్ చేస్తారేమో చూడాలి.
ఇదిలా ఉంటే, `మెగా 154`కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. 2023 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావచ్చంటున్నారు.
![]() |
![]() |