Facebook Twitter
కోనేటి రాయున్ని...నే కోరేదొక్కటే ?

ఓ ఏడుకొండల ! వెంకట రమణా!

కోరిన కోర్కెలు తీర్చేటి ఓ కోనేటి రాయడా !

ఏడుకొండలు ఎక్కి మిమ్ము వేడుకునేది !

కోటి కొబ్బరి కాయలు కొట్టి మిమ్ము

కోరుకునేది "ఒకే ఒక్క వరం" తండ్రి !

 

వద్దు వద్దు మాకు ఖరీదైన 

....."కార్లు" వద్దు

....."కోటాను కోట్ల 

....."స్థిరాస్తులు"వద్దు

....."పట్టు వస్త్రాలు" వద్దు

....."మేడలు, మిద్దెలు" వద్దు

......"విలాసవంతమైన "విల్లాలు" వద్ధు

......"బంగారు వెండి ఆభరణాలు" వద్దు

 

కాస్త మంచితనము....మానవత్వం గల...

స్వచ్చమైన...మచ్చలేని...వ్యక్తిత్వం గల...

 

ఉన్నదాంతో తృప్తి చెందాలనే...

ఉన్నతమైన స్థానంలో ఉండాలనే...

ఆలోచనలు గల... 

అభ్యుదయ భావాలు గల...

 

గురువులంటే...వినయం...

విధేయత గల...

పెద్దలంంటే...ప్రేమ...

గౌరవం...అభిమానం గల...

 

కన్న తల్లి తండ్రులంటే... 

కని...పెంచే...

కనిపించే దేవతలని

కడవరకు...

కన్నుమూసి కాటికెళ్ళే వరకు

కట్టై కాలే వరకు...వారిపై

కనికరము...కరుణ 

దయ...జాలిని చూపే 

దయార్ద్రహృదయం గల...

 

భగవంతుడంటే...

అపారమైన...

భక్తి విశ్వాసాలు గల...

చేసే ఉద్యోగంలో 

వ్యాపారంలో నీతి...నీజాయితీ గల...

 

చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ఏకాగ్రత...నైపుణ్యం గల...

సభ్యసమాజం పట్ల సంపూర్ణ అవగాహన...బాధ్యత గల...

 

నిరుపేదల్ని...

అనాధల్ని సైతం ప్రేమించే 

మంచిమనసు గల.

ఆపదలో ఉన్నవారిని తక్షణమే ఆదుకోవాలనే సద్బుద్ధి గల...

 

బిడ్డలను మాకివ్వండి ! 

ఓ దయగల మా దైవమా !  

ఈ ఒక్క వరమిచ్చిన చాలునయ ! 

కోటి వరాలిచ్చినట్లేనయా!