అందిన అవకాశం ...పొందిన ఆనందం
ముచ్చటైన
పచ్చని కాపురంలో
చిచ్చు రేపుకొనే వారంతా
పిచ్చివాళ్ళే వెర్రివాళ్ళే
ముందరున్న
అందమైన ఆహ్లాదకరమైన
ఉన్నతమైన ఉత్కృష్టమైన
తిరిగిరాని ఈ జీవితాన్ని
అనుభవించని వారంతా
అంధులే అజ్ఞానులే
అందిన అవకాశాన్ని
పొందిన ఆనందాన్ని
ఆర్జించిన ఆస్తిపాస్తుల్ని
అనుభవించని వారంతా
అవివేకులే అమాయకులే
నా ఈ చిరుకవితను
ఓపికతో చదివిన వారంతా
చదివి అర్థంచేసుకున్న వారంతా
అర్థం చేసుకొని ఆలోచించే వారంతా
ఆచరించే వారంతా గొప్పఅదృష్టవంతులే



