మొన్న పరిచయం,
నిన్న ప్రేమ,నేడు వివాహం
మూడుముళ్లతో నూరేళ్ళకే కాదు
జన్మజన్మలకు జతచేయబడ్డారు మీరు
భార్యా భర్తలు భగవంతుడు ప్రేమతో
అందించిన బంగారు బహుమతులు
ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి
గొప్పగా గౌరవించుకోవాలి
చిన్నచిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ లు
అప్పుడప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలి
ఒకరిపై ఒకరు గట్టి నమ్మకం
సంపూర్ణ విశ్వాసం కలిగి వుండాలి
ఇద్దరి మనసులు హృదయాలు
పాన్పులు పరిశుద్ధమైనవై వుండాలి
చెప్పడుమాటలు వినరాదు
తప్పటడుగులు వేయరాదు
పుట్టింటివారిని మెట్టింటివారిని
అభిమానంతో సమదృష్టితో చూడాలి
ఎక్కువ తక్కువ తేడాలుండరాదు
ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవాలి
తిట్టుకోరాదు పోట్లాడుకోరాదు
కోపంతో కొట్లాడుకోరాదు
మనసులో ఏమీ దాచుకోరాదు
ముఖాముఖీగా చర్చించుకోవాలి
మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వరాదు
ఆ వ్యక్తి సలహాలు సహాయం కోరరాదు
కలకాలం కలిసివుందాం అనుకోవాలి
విడిపోదామని కలనైనా అనకూడదు



