కప్పా ? చిప్పా ? ఏది కావాలో తేల్చుకో
అభివృద్ధి చెందరా శిష్యా అంటే
లేదు అడుక్కు తింటానన్నాడట
వెనుకటి ఒక శిష్యుడు
తక్షణమే తధాస్తు అంటూ
గురువు గారు శిష్యుని
చేతిలో ఒక చిన్న చిప్ప పెట్టి
అందులో నాలుగు చిల్లర
డబ్బులు వేసి వెళ్ళి ఆనందంగా
అడుక్కుతినమని ఆశీర్వదించాడట
ఔనిది నిజం అమ్మానాన్నలు
చెప్పిన మాట వినకపోవడం తప్పే
వినని ఎవరికైనా చివరికి చేతికి వచ్చేది చిప్పే
వారి ముందు జీవితం ముళ్ళమయం
మాట విన్నవారి బ్రతుకు బంగారుమయం
జన్మ నిచ్చిన అమ్మా నాన్నలను ప్రేమించాలి
జ్ఞానం దానం చేసిన గురువును గౌరవించాలి
ప్రాణం పోసిన పరమాత్మను నిత్యం స్మరించాలి



