Facebook Twitter
నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఓ మిత్రులారా! 
మీకు ఈనూతన సంవత్సరం 
గత సంవత్సరంకన్నా" ఘనంగా" వుండాలని 
మీ బాధలు భయాలు కష్టాలు కన్నీళ్ళు 
చింతలు చీకాకులు పాత పెద్ద నోట్లలా రద్దైపోవాలని
మీ కళ్లు మీ ఇల్లు మీ ముఖాలు మీ హృదయాలు
కొత్త కరెన్సీ కట్టల్లా ఎప్పుడూ కళకళ లాడుతూ వుండాలని 
ఇక  ఈ సంవత్సరమంతా మీరు 
ఏ "కరెన్సీ కష్టాలు" లేకుండా  
ఏ "చిల్లర ఇబ్బందులు" పడకుండా
కాళ్ళరిగేలా ఎటియంల చుట్టూ తిరక్కుండా
ఎర్రని ఎండలో బ్యాంకుల ముందు 
గంటల తరబడి క్యూలోనిల్చోకుండా వుండాలని 
మీ కోరికలన్నీ నెరవేరాలని
మీ ఆశలన్నీ తీరాలని కన్నకలలన్నీ పండాలని
మీ కళ్ళల్లో కాంతి మనసులో శాంతి నిండాలని
మీ ఇల్లంతా సిరి సంపదలతో తులతూ  గాలని
మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని
మీహృదయాలు ఉల్లాసంతోఉత్సాహంతో ఉప్పొంగాలని
మీరు తలపెట్టిన ప్రతి కార్యము సఫలీకృతం కావాలని
ఎవరూ చేరుకోలేని"విజయ శిఖరాలను"
మీరు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ 
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ  
మా నూతన సంవత్సర శుభాకాంక్షలు

చిరు కవి(తల)తో