చింతకాయలు…
మంత్రాలతో చింతకాయలు
రాలతాయా? అంటారు
కొందరు అవివేకులు
ఆ మంత్రాలలోని
మహిమ మాధుర్యం
వాటి వెనుక నున్న
ప్రజ్వలించే అఖండశక్తి
తెలియని అమాయకులు,కాని
మంత్రాలతో చింతకాయలు
రాలకపోతేనేం
మంత్రాలతోనే
మనల్ని చితికి చేర్చే
చింతలన్నీ
చిటికెలో తీరిపోతాయి
అవిమన మనసుకెంతో
ప్రశాంతతను
చేకూరుస్తాయి.
అది చాలదా?
అర్థం కాని మంత్రాలు
వ్యర్థం అనకండి
వినండి ముందు
మంత్రపఠనంతో
మైమరచిపొండి
మనోనేత్రంతో
పరవశించి
శివతాండవం చేసే
ఆ చిత్తాన్ని
తిలకించండి చాలు
ఆపై మీ జన్మ ధన్యం
మీకు దక్కు పుణ్యం



