చీకటిలో వున్నానని చింతించకు
ఈ కష్టాలను ఇక భరించలేనని
ఈ బరువును ఇక మోయలేనని
ఈ కన్నీటి ధారలను ఇక ఆపలేనని
ఈ మానసిక క్షోభను ఇక తట్టుకోలేనని,అనకు
అవన్నీ ఆ భగవంతుడికి ముందే తెలుసు
సరైన సమయానికే నీ సమస్యలన్నీ తీరుతాయి
నీవడిగినవి అడగనివి కూడా నీ కివ్వబడతాయి
కానీ కాస్త ఆలస్యమౌతుంది అంతే....
అదీ నీ విశ్వాసానికి ఒక అగ్ని పరీక్ష
1000 సంత్సరాలు కూడా ఆయనకి ఒక రోజే
అందుకే నీ సమస్యలన్నీ ఆదైవంకన్నా చిన్నవే
అవి గాలికిపొట్టులా ఎగిరిపోతాయి
నీళ్ళు చల్లినట్లుగా చల్లారి పోతాయి
మంచుముక్కల్లా కరిగి పోతాయి
చీకటి తెరల్లా చిరిగి పోతాయి
కానీ,కాస్త ఆలస్యమౌతుంది అంతే....
అంతా మనమంచికే
పచ్చికాయ కాస్త పండినట్లే
కమ్మగా తినవచ్చు కడుపు నింపుకోవచ్చు
ఆలస్యం చేయకుండా ఆకలితీర్చుకోవచ్చు
ఆలస్యమై పోయినందుకు ఆదైవంపై నిందలు వెయ్యకు
కఠినంగా నీ హృదయపు తలుపులు మాత్రం ముయ్యకు



