Facebook Twitter
మీకో మాట చెప్పాలని ఉంది.( పార్ట్ - 1)

ఓ నూతన వధూవరులారా !
మీకోమాట చెప్పాలని వుంది !
ఆనందం వెల్లివిరిసే
మీ వైవాహిక జీవితానికి‌
"చిరు చిట్కాలు"
మీ "సుఖ సంసారానికి కొన్ని
"సూత్రాలు" అందించాలని వుంది

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఇక్కడ కలిసి జీవనం సాగించే
మీ భార్యాభర్తల దాంపత్యం
ఇరుగుపొరుగు వారు
...ఈర్ష్యపడేలా
...అన్యోన్యంగా
...ఆదర్శవంతంగా
...సుఖమయంగా
...శుభప్రదంగా
...మంగళ కరంగా...సాగిపోవాలని...
అది మీకుమాత్రమే ఆ
భగవంతుడు ప్రసాదించిన ఒక
...."బంగారు వరంగా"...
మీరిద్దరూ భావించాలని...
ఓ నూతన వధూవరులారా !
మీకోమాట చెప్పాలని వుంది !

పడిపోయినా...పైకి లేవాలని
చెడిపోయినా...బాగుపడాలని
విడిపోయినా...కలిసి ఉండాలని
దూరమైపోయినా‌... దగ్గరవ్వాలని
మీరు "చిలకా గోరింకలై"
చెరగని చిరునవ్వులతో
చిరకాలం జీవించాలని...
ఓ నూతన వధూవరులారా !
మీకోమాట చెప్పాలని వుంది!