ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అని
ఖరీదైన టేస్తులన్ని ఫ్రీగా చేస్తూన్నారని
సంబరపడి పోకండి
కొన్నిషాపింగ్ మాల్స్ పండుగ రోజుల్లో
One plus One అంటూ
60 to 70 % Off అంటూ
లక్షల కోట్ల బహుమతులు
ఆర్భాటంగా ప్రకటిస్తాయి.
కొన్న ప్రతివారికి
చెవులో పూలుపెట్టినట్లు కొన్నికూపన్లు
చేతికి ఇచ్చిఇంటికి పంపుతాయి
కాని పండగ ఐపోయిన తర్వాత
ఎవరికిచ్చారో ఆ లక్షలు కోట్లు ప్రకటించరు
అదే మార్కెటింగ్ మాయ అంటే
అందుకే మునిగి పోకముందే,
మోసపోకముందే
ఈ పాకేజీలలో వుండే లీకజీలేమిటో
మాయలేంటో
మతలబులేంటో
కాస్త తెలుసుకుంటే మనకే మంచిది
ఎందుకంటె
ఏ పులికి జింక మీద
ఏ పాముకు కప్పు మీద
ప్రేమ ఉండదు
ఇది ఎవరు కాదనలేని నగ్న సత్యం
కార్పోరేట్ హాస్పిటల్లో కసాయితనముంది
కాస్త గమనించాలి
వేటగాని కన్నుఎప్పుడు జింక మీదనె
కోరికలతో రగిలే యువకుడి మనసంతా
వయసొచ్చిన పడుచుపిల్లల మీదనే
కార్పోరేట్ డాక్టర్లకళ్ళన్నీవయసు
మీద పడిన ముసలివాళ్ళ మీదనే
ఆపరేషన్లు చేసి ఆయుష్షు పోసే
దైవసమానులైన డాక్టర్స్ వున్నారు,అలాగే
కళ్ళుతిరిగే బిల్లులువేసి, జలగల్లాపీల్చిపిప్పిచేసి
జేబులు ఖాళీచేసే ఘనులున్నారు కాస్త...జాగ్రత్త



