Facebook Twitter
వేగం" ప్రధానం...అతి ప్రమాదం!

ఉడుకు రక్తం ఉప్పొంగే
ఓ యువతీయువకుల్లారా!

ఇది కంప్యూటర్ యుగం
వేగం" ప్రధానం ఇదే నినాదం
వేగం" ప్రధానమే కాని
అతి "వేగం" అతి ప్రమాదకరం

బైక్ లమీద రోడ్లమీద
ర్యాష్ డ్రైవింగు చేయకండి
డివైడర్లను ఢీకొట్టకండి
విజ్ఞతతో డ్రైవింగ్ చేయండి
వేగం ప్రధానమే...కానీఅది
ప్రమాదం జరగనంత వరకే

నిన్న ఆలస్యం అమృతం...విషం
నేడు వేగం ప్రధానం...అతిప్రమాదం

రాత్రిపూట వీధి లైట్లు వెలిగితే విజ్ఞత
పగటిపూట వెలిగితే వింత విచిత్రం

రాత్రి పూట డ్రైవర్లు లైట్లువేస్తే ఎన్నో
ప్రమాదాలు తప్పుతాయి తగ్గుతాయి
పగటిపూట వేస్తే పగలబడి నవ్వుతారు ?

అందుకే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో
తెలిసివుంటే‌ జీవితం సుఖమయం
ఎక్కడ ‌వాహనం ఎంత వేగంగా నడపాలో
తెలిసివుంటే ఏ ఇంటా ఉండదు విషాదం