Facebook Twitter
ఈ నూతన జీవితం ఆయనకే అంకితం…

ఇది
ఆ కరుణామయుడైన
ఆ దయామయుడైన
ఆ ప్రేమమూర్తియైన
ఆ అఖండ శక్తిస్వరూపుడైన
ఆ దేవదేవుడు
కలలో సైతం ఎవ్వరూ ఎన్నడూ
ఊహించని రీతిగా
ఒక గొప్ప వరంగా
ఒక అద్భుత కానుకగా
ప్రేమతో అందించిన
ఈ నూతన గుండెను
ఈ నూతన జీవితాన్ని
ఈ మరోజన్మను
ఆయనకే ఆయన ఆలోచనలు
అమలు పరచులాగున
ఆయన ఆజ్ఞలకులోబడి
ఆయనతలంపులకు అనుగుణంగా
అడుగులు వేస్తూ
ఆయన ఆజ్ఞాపించిన కార్యాలను
నిర్విఘ్నంగా నిర్వహిస్తూ
ఏమూలనుండో నక్కినక్కి
ఆకస్మికంగా, హఠాత్తుగా వచ్చే
ఆ మృత్యుదేవత అడుగుల సవ్వడిని
అనుక్షణం గమనిస్తూ
అతి జాగ్రత్తగా అతి సున్నితంగా
ఈ గుండెను కాపాడుకుంటూ
క్షణం ఒక యుగంగా
ప్రతిదినం ఒక గండంగా కాక
ప్రతిదినం ఆనందంగా
పరమానందంగా
పరమాత్మే ఆధారంగా
ఘనంగా ఈ బ్రతుకును గడపాలి
అనుక్షణం ప్రశాంతంగా బ్రతకాలి