Facebook Twitter
విహార‌యాత్ర

లాహిరి...లాహిరి...
లాహిరిలో...
ఓహోజగమే ఊగెనుగా
తూగెనుగా...ఆ...ఆ...ఆ
అలా అలా అలల కలలపై
తేలియాడుతూ
ఆకాశ వీధిలో విహరిస్తూ
ఆనంద శిఖరాలు చేరి
సంతోష సాగరాలు ఈది
స్వర్గరుచులు చవిచూసి
పొందిన వందేళ్లకైనా
మరువలేని మరుపురాని
ఆ విహారయాత్ర మధురజ్ఞాపకాలే
పచ్చని కాపురానికి "పసిడి పందిళ్ళు"

ఆ విహారయాత్ర‌
మధురజ్ఞాపకాలే
అందమైన
అతిసుందరమైన
ప్రేమకు ప్రతిరూపమైన
ప్రాణత్యాగానికి చిహ్నమైన
సజీవమైన సమాధియైన
పాలరాతి ప్రేమమందిరానికి
దృఢమైన పటిష్టమైన "పునాదిరాళ్ళు"

ఔను విహారయాత్ర అంటే
కొందరికి విజ్ఞానయాత్ర 
కొందరికీ వినోదయాత్ర 
కొందరికి విషాదయాత్ర 
వివేకవంతులకు‌ వివాహబంధాన్ని
వెలుగుమయం చేసుకోవడానికే
బంగారుమయం చేసుకోవడానికే
ఆనందమయం చేసుకోవడానికే
శోభాయమానం చేసుకోవడానికే
సుఖసంతోషాలతో జీవించడానికే