Facebook Twitter
తేనెలూరే నీ బిగికౌగిలిలో…

ప్రియా ! ఓ ప్రియా !
వద్దు వద్దు అనకు
వెచ్చని వెన్నెల్ని మనతో
ముచ్చటలాడనియ్ !
పచ్చని మన కాపురానికి
వేయిపందిళ్ళు వేయనియ్ !
శృంగారంలో శృతిలయలు పలకనియ్ !
సంసారంలో సరిగమలు చిలకనియ్ !
అంబరాన చుక్కల్ని సంబరాన కులకనియ్ !

ప్రియా !  ఓ ప్రియా !
సదా నీ ఎదలో
నన్ను నిదురించనియ్ !
తేనెలూరే నీ బిగికౌగిలిలో
నాకు తెలవారనియ్ !
భయపడకు ఉన్నానని
నేనున్నానని వస్తున్నానని !
నీ కంటి పాపనై నీ వెంటే నీడలా
నీకు తోడుగా నీడగా ఉంటానని !
పంచభూతాలసాక్షిగా ప్రమాణం చేస్తున్నా !

ప్రియా ! ఓ ప్రియా !
భయపడకు
మానని గాయాలకు
మందు లేదని
మరణాన్ని మందు అడక్కు
చున్నీని మెడకు చుట్టుకోకు
ఫ్యానుకు ప్రాణాలను అర్పించకు
నిన్నటి నీ ప్రేమలేఖనై
నీకొక తీపిజ్ఞాపకమై వేకువనై నేవొస్తా
వెలుగురేఖనై విచ్చుకుంటా...
నీవే‌ నిండిన నా హృదయాన్ని
నీకే ఇచ్చుకుంటా...
స్వచ్చమైన మచ్చలేని 
నీ ప్రేమను పుచ్చుకుంటా...
ప్రియా ఓ ప్రియా!
నన్ను నమ్ము !నా మాట నమ్ము!