ప్రతి దినం
మన పయణం
పడకనుండి నడక వైపు
చీకటి నుండి వెలుగువైపు
అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు
మనం ప్రశాంతమైన
వాతావరణంలో బ్రతకాలంటే...
రోజంతా ఉల్లాసంగా
ఉత్సాహంగా ఉండాలంటేే...
మనసున అరిషడ్వర్గాలు
అంతరించి పోవాలంటే...
మన ఆరోగ్యాన్నెవరికీ అద్దెకివ్వరాదు
అంగడిలో సరుకులా అమ్మరాదు
సోమరితనాన్ని బద్దకాన్ని కొనరాదు
అందిస్తాయవి తాత్కాలిక ఆనందాన్ని
ఆపై కానుకగా ఇస్తాయి మనకు
శాశ్వితకాలముండే మొండివ్యాధుల్ని
ఔను ఆలస్యంగా లేచేవారెవరూ
సూర్యోదయాన్ని చూడలేరు
ప్రతిఉదయం నీ హృదయం కావాలి
ప్రతిసూర్యోదయాన్ని నీవు దర్శించాలి
సూర్యదేవుని దర్శనమంటే దైవదర్శనమే
సూర్యునికంటే
ముందులెయ్ సుఖపడుతావ్
పుష్టికరమైన
ఆహారంతీసుకో షష్టిపూర్తి చేసుకుంటావ్
ఈఒక్క ఆరోగ్యసూత్రాన్ని తు.చ తప్పక పాటించు
రాత్రి పదింటికి పడక...ఉదయం నాలిగింటికి నడక
ఏ జబ్బు నీదికాదు నీ జేబులోడబ్బునీదే
నీవు ఆసుపత్రికి అనారోగ్యానికి ఆమడదూరం



