Facebook Twitter
మూర్ఖులకిదే ముగింపు...?

కోరికలు అగ్నిజ్వాలలై రగిలితే

విషసర్పాలై బుసలుకొడితే

కామంతో కళ్ళుపొరలు‌ కమ్మితే

తనా మనకు తావుండదు

తప్పటడుగులు వేస్తారు

తప్పక తప్పులు చేస్తారు

 

కామాంధులు పట్టపగలే పశువులుగా

మానవమృగాలుగా మారిపోతారు

ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు

ఆరునెలల పసి పాపలతోనైనా

అరవై ఏళ్ల ముసలివారితోనైనా

కామవాంఛలు తీర్చుకుంటారు

 

సందుల్లో గొందుల్లో నడివీధుల్లో

నక్కినక్కి తిరిగే ఈ "గుంటనక్కల్ని"

కూడుతిని కుండను సైతం

పగలగొట్టే ఈ "గజ్జికుక్కల్ని"

సిగ్గులజ్జ లేకుండా మదమెక్కి

ఊరంతా ఊరేగే ఈ "ఆంబోతుల్ని"

 

జైల్లో పెట్టడమెందుకో?

కోర్టులో విచారించడమెందుకో?

ప్రజలచే కొరడాలతో కొట్టించి,

కౄరంగా నడిరోడ్డుపై శిక్షించి, 

ఊరంతా చూస్తుండగా ఉరితీస్తే సరి

 

తప్పులు చెయ్యనివారు

లోపాలు లేనివారు ఈ లోకానలేరు

కాని పాపాలతో పేరుకుపోయిన వారిని

నరకకూపాలలో కూరుకుపోయిన వారిని

సకల శాపాలకు గురైనవారిని మానవత్వంలేని

కామపిశాచుల్ని ఉరితియ్యడమే ఉత్తమం మరి మీరేమంటారు?