Facebook Twitter
ఆ కన్నబిడ్డలు....

తమ
కన్నబిడ్డల
బంగారుమయ
భవిష్యత్తు కోసం
ఎన్నో కలలు కన్న
ఎంతగానో శ్రమించిన
ఎంతగానో ప్రేమించిన
ఎన్నోతప్పుల్ని క్షమించిన
రేయింబవళ్ళు కునుకులేక
రెక్కలు ముక్కలు చేసిన
ముసలి తల్లిదండ్రులను 
కుక్కలకన్న హీనంగా "చూసే"
అనాధాశ్రమంలో "చేర్చే
ఆ కన్నబిడ్డలు - పాషాణ
హృదయులే "మానవ మృగాలే"

ఇంటికి కంటికి దూరంగా
ఒంటరిగా అనాధాశ్రమంలో చేర్చి
రెక్కలు తెగిన పక్షులుగా
దిక్కులేని అనాధలుగా
ఆకలికి అలమటించే
అస్థిపంజరాలుగా"మార్చే
ఆ కన్నబిడ్డలు - బ్రతికి
ఉన్నాసరే వారు "చచ్చిన శవాలే"

కాని,తల్లిపాలు త్రాగి పెరిగి
చేసిన మేలును మరువక
కన్నవారి కష్టాలను చూసి
"కాసిన్ని కన్నీటి చుక్కలురాల్చే
తమ తల్లితండ్రుల "ఋణం తీర్చే
ఆ కన్నబిడ్డలు - నిజానికి మనసున్న
మానవత్వమున్న "మహరాజులే"