తనకు మాలినధర్మం....
ఎన్ని
అప్పులైనా
చేయవచ్చు
కాని అప్పునిప్పని
తీర్చకుంటే ముప్పని
తెలుసుకోకుండా తలను
తాకట్టుపెట్టి అప్పులుచేయరాదు
దానధర్మాలు చేయవచ్చు
కాని, తనకు మాలినధర్మం
మొదలు చెడ్డబేరమని మరువరాదు
సందేహించవచ్చు
కాని,ఆ సందేహంలోనే దగ్దమైపోరాదు
బరువులు మోయాలి
కాని,తలకుమించిన బరువులుమోయరాదు
మంచి సలహాలివ్వవచ్చు
కాని అడగనివారికి, అవసరంలేనివారికి
అర్హతలేనివారికి ఉచిత సలహాలనివ్వరాదు
ఆలోచించవచ్చు
కాని,అతిగా ఆలోచించరాదు
ఆలోచిస్తూ ఆలస్యం చేయరాదు
విలువైన కాలాన్ని దుర్వినియోగం చేయరాదు
ఓ
దైవమా!
ఉన్నావా ? ఉంటే
కళ్ళుమూసుకున్నావా ?
అంటూ దేవుని ఉనికిని ప్రశ్నించరాదు
దేవుడే లేడంటూ మొండిగా వాదించరాదు
జననం మరణం నిజమైతే దేవుడు దెయ్యం నిజమే



