మెరుపు కవిత్వం
చేయి బలంగా విసిరి
మెరుపుని గుప్పెట పట్టడం
కవిత్వం
శూన్యంలోకి ఎగిరి
నక్షత్రమాలని లాగి ధరించడం
కవిత్వం
కాళ్లు నేలన బలంగా పాతుకుని
ఎడం చేత్తో నింగిని
చర్రున కిందికి వంచడం
కవిత్వం
ప్రియుడికి అధరామృతాన్నిచ్చీ
బిడ్డకీ అమృతమయ పాలధారల్ని
మిగల్చటం
కవిత్వం
కవి చేవ్రాలు కవిత్వం
-పెమ్మరాజు గోపాలకృష్ణ

ఒక అడవిలో ఒక జింక వుండేది. దానికి ఒక పిల్ల వుండేది. అది చానా ముచ్చటగా... కనబడితే చాలు... కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేలా వుండేది. ఎప్పుడూ చెంగుచెంగున ఎగురుతా, దూకుతా, ఆడతా, పాడతా, నవ్వుతా, తుళ్ళుతా జలపాతంలా వుండేది.
Mar 1, 2025
కాళీపట్నం ‘జీవధార’:కనుతెరిచిన క్షణం
ఎమర్జెన్సీ రోజులు...ఎంచక్కా యద్దనపూడి సులోచనారాణి ‘బహుమతి’ కథలూ, ఆదివిష్ణు ‘కలెక్టరూ! నన్ను క్షమించు కథలూ’, గొల్లపూడి మారుతీరావు ‘రోమన్ హాలిడే’ కథలూ చదువుకుంటున్నరోజులు. తెలియకుండానే జీవితం చంకనాకిపోతున్న రోజులు.
Feb 27, 2025
దానిని కుండలో వేసి అతనికి ఇవ్వండి. మంత్రి కూడా అలాగే చేశాడు. ఇప్పుడు ఆ బిచ్చగాడు సంతోషంగా పాయసం తింటూ..
Feb 17, 2025
సున్నపుపొడి శిక్ష.. బీర్బల్ సమయస్ఫూర్తి
ఒకసారి, న్యాయస్థానం సైనికుడికి అర కిలో సున్నపురాయి పొడి తినమని శిక్ష విధించింది. తమలపాకులతో (తాంబూలం) సున్నపురాయి పొడిని తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తున్నప్పటికీ, అర కిలో సున్నాన్ని ఒకేసారి తినడం ద్వారా మానవులు బతికే అవకాశం లేదు.
Feb 15, 2025
అబద్ధం అందంగా, సత్యం కఠినంగా ఎందుకు ఉంటుది? ఈ చిన్న కథ చదివితే మీకే అర్థమవుతుంది అబద్ధం అందంగా ఉంటుంది కానీ సత్యం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఇది చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే ఈ నానుడి వెనక ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Feb 12, 2025
మా పిన్నికూతురు పెళ్లిలో మొదటిసారి పూర్ణని చూశాను. తెల్లగా, పొడుగ్గా ఉంది. రెండు జడలతో ఉంది. లంగా, ఓణీ మీద ఉంది. ఇంతలేసికళ్లతో, అంత లేతమొహంతో ఊరిస్తున్నట్టుగా ఉంది. కుర్రకారంతా ఎవర్రా? ఎవరీ అమ్మాయి? అని వాకబులో పడింది. వాకబు చేయగా చేయగా ఆఖరికి తెలిసిందేమిటంటే... పూర్ణ వంట బ్రాహ్మణుని కూతురు.
Feb 8, 2025
ఒక గ్రామంలో రెండు వీధులు ఉండేవి. మధ్యలో ఓ చిన్న నీటి కొలను ఉండేది. దాని ముందు శ్రీకృష్ణుడి విగ్రహం ఒకటుంది. ఆ రెండు వీధుల మధ్య సఖ్యత లేకపోవడంతో.. ఎప్పుడో కానీ, ఆ విగ్రహానికి పూజలు చేసేవారు కాదు.
Feb 5, 2025
ముక్కుసూటిగా మాట్లాడడం, మొహమ్మీద గుద్దినట్టుగా మాట్లాడడం తప్పురా! అంత నిర్మొహమాటంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే కష్టం. జీవితంలో పైకి రాలేవు. సుమతిశతకకారుడు ఏం చెప్పాడు? ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు.
Feb 4, 2025
కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం...ఈ నాలుగునెలలూ అమ్మ తులసికోట దగ్గరే ఎక్కువగా గడిపేది. తెల్లారుజామున ఎప్పుడు లేచేదో ఏమో! నేను లేచేసరికి తులసికోట చుట్టూ దీపాలు వెలుగుతూ ఉండేవి. బంగారురంగులో కోట మెరిసిపోయేది.
Jan 29, 2025
గొప్ప రామభక్తుడైన తులసీదాసు కాశీ క్షేత్రంలో ఉంటూ రాముని మహిమలు కీర్తిస్తూ గానం చేసేవాడు. ఆయన ఆశ్రమంలో నిత్యమూ రాముని కీర్తిస్తూ భజనలు చేసేవారు. రామనామగానంతో పరిసరాలు మారుమోగేవి.
Jan 28, 2025
TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
|