TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ఎవరి గోడ వారిదే !!
ముఖపుస్తకం గోడని శుభ్రంగా ఉంచాలంటే కాస్తంత అందరి గోడులని పక్కన పెడితే "గోడ ..కీ ...గోడు.. కూ " దూరంగా ఉండే అవకాశం ఎక్కువ😊
అందుకే "ఇతరుల ముఖపుస్తకాల గోడ మీద ఉన్నవన్నీ ..."చూసినంతనే
ఎందుకు ? ఏమిటి ?అవసరం ? అనవసరం ?మేలు /కీడు గ్రహించుకుంటే కొంత సమయం వృధా అయినా మనకి మనమే మేలుచేసుకొన్నవారమవుతాము.
ఇంకాస్త సమయం వెచ్చించ గలిగితే "స్వంత మాటలను, ఆలోచనలను"కూడా చేర్చి పంచుకోవచ్చు. అంతే కాక వారి సమాచారం లో ని అక్షర , భాష , వ్యాకరణం దోషాలుంటే అవి మనవంతుగా సవరణలు చేసి సహాయం చేసిన వారమవుతాము.
ఈ విధంగా"ఓ ముఖపుస్తకం గోడ " కు గొడుగు పట్టినట్లే ...
ఎక్కువ సంఖ్యల్లో గుంపులు , పేజీలు ఫాలో అయ్యేవారికి "అభిప్రాయ సేకరణ " చాలా ఉపయోగం !!
ఇదంతా వ్రాసి పెట్టడానికి గల కారణం ,అన్నిటికీ "అవసరమైన - వ్యాకరణం " , పదం , శబ్దం , ఉచ్చారణ , మరెన్నో ...
మరొక ముఖ్యమైన విషయం ఎవరి గోడ వారికే కదా
ఇతరుల గోడ మీద ఇకనుంచి "మన గోడుని " పెట్టకుండా ఉండాలంటే .......
నిర్ణయం మీదే 😊
వ్రాసినవారు..
దివ్య చేవూరి(లిటిల్ ఎల్మ్ , టెక్సాస్ )