Facebook Twitter
కోపం ఓపిక

 

కోపం ఓపిక

 

 

నీలోని కోపాన్ని నువ్వెన్నిసార్లు బయటికి విసిరేసినా
అది ఎంతో ఓపికగా నీ దగ్గరే పడి ఉంటుంది.
నీ కంట్రోల్ లో ఉండే కోపానికే అంత ఓపిక ఉంటే
కోపాన్ని కంట్రోల్ చేయగలిగే నీకెంత ఓపిక ఉండాలి.
కోపానికంటే నీకే ఎక్కువ ఓపికుందని నిరూపించు.
కోపాన్ని నీలోనే అణిచి ఉంచు.
నువ్వలా నీలోని కోపాన్ని బయటికి విసిరేస్తూ పోతే
కొన్నాళ్ళకి అందరూ నిన్ను దూరంగా విసిరేస్తారు.
కోపాన్ని నీలోనే అనుచుకొని ఓపికగా ఉంటే
నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు. నీకంటూ కొందరు అండగా ఉంటారు.

- గంగసాని