posted on Apr 12, 2014
చుక్కల్లా మెతుకులు
వెన్నెల్లా పెరుగు
విస్తరాకులో
ఎంత విహాయసం!
శాస్త్రవేత్తలరా!
బాంబుల్ని పూలతో చేయండి
స్నేహ యుద్ధం
చేసుకుందాం.
ఎక్కాల్సిన రైలు
మిస్సయితే కష్టం
ఎక్క కూడని రైలు
ఎక్కితే నష్టం
వై. రామకృష్ణారావు