posted on Feb 5, 2014
సముద్రం మధిస్తే
చాలా వచ్చాయిట !
వలవేస్తే
ఒక్క చేపా పడలేదు.
తారలు కుమ్ములాడుకుని
విరిగి పడుతున్నాయా ?
మిణుగురులంటే
అవే మరి!
చదువూ, సంధ్యా నేర్పా
ఆటాపాటా నేర్పా
నవ్వు నేర్పడం మాత్రం
నా వల్ల కాలే.
రామకృష్ణారావు