posted on Feb 10, 2014
కైక రాజ్యాన్నీ
భరతుడు చెప్పుల్నీ
రావణుడు సీతనూ
రామా ! ఐ పిటీ యూ.
పల్లెమీద ప్రేమగీతం
ఒట్టి బడాయి
పట్టుమని
పదిరోజులుండలేడు.
ఆకులు రాల్చి
పూలనే మిగుల్చుకుంటుంది
గూల్ మొహర్.
కనువిందుకేనా ఈ త్యాగం.
- వై.రామకృష్ణారావు