posted on Aug 16, 2013
నా పుణ్యఫలముగా
వి. బ్రహ్మనందచారి
నా పుణ్యఫలముగా
దొరికితివి నీవని
అన్నావు పలుమార్లు
విన్నాను చెవులార
నా అండ నీవుండ
అన్నమునకేనాడు
కరువులేకుండేను
కలుములా రాణమ్మ
కల్హార ముకుళములు
కదలినంతనే చాలు
కలతలన్నియు తీరు
నా....జాబిలమ్మ