నగరం - నారీమణుల ఊహలు
posted on Aug 13, 2013
నగరం - నారీమణుల ఊహలు
శ్రీమతి శారద అశోకవర్ధన్
నగరంలో నారీమణి
ఇరుగుతోటీ పొరుగుతోటీ
అయిన వాళ్ళెవరితోటీ
కబుర్లతో కాలాన్ని
కాస్సేపయినా గడపలేని
యంత్రంలాంటి పూబోణి
నగరంలో నారీమణి!
నాలుగింటికి తెల్లారు ఝామునే లేచినా
నాలుగు బిందెలు నీళ్ళు పడని పంపుతో
తలకొట్టుకుంటూ
నడిరాత్రివరకూ నడుంవిరిగేలా
అన్ని పనులూ తనే చేసుకుంటూ
ఒకపక్క శ్రీవారు సకాలానికి ఆఫీసు కెళ్ళాడానికి
ఏర్పాట్లలో సతమతమైపోతూ
నలిగిపోయే నగరంలోని లలనామణి నారీమణి!
వేసవికాలం ఎప్పుడొస్తుందా
కనీసం పిల్లలకైనా సెలవులొస్తే
కాస్త రద్దీ తగ్గుతుందనీ
కొద్ది విరామం దొరుకుతుందనీ
శ్రీవారిని ఒప్పించి సెలవు పెట్టిస్తే
నాలుగు ఊళ్ళూ తిరిగి రావొచ్చని ఉవ్విళ్ళూరుతూ
ఊహలో తేలిపోతుంది రమణీమణి
ఆ వేసవి కాలం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది
వేసవిలో కొత్త సమస్యలు కొల్లలు!కోకొల్లలు!
ఆవకాయ పెట్టనిదే అసలు బయలుదేరడమెట్లా?
అందుకని ముందుగానే సరుకులకోసం అంగడికెళితే
ఆకాశాన్నంటుకునే ధరలు దాచుకున్న డబ్బంతా అక్కడే దోచేసి
అసలు ప్రయాణానికి చిల్లిగవ్వ మిగలకుండా
చేసేస్తాయ్ ! అప్పుల్లో ముంచేస్తాయ్!
ప్రయాణం లేకపోయినా
ప్రాణప్రదమైన కొత్త ఆవకాయ పెట్టుకున్నందుకు
కొండంత పొంగిపోతూ,
' పిల్లలతో సినిమాలు చూసి గడిపెయ్యోచ్చులే ' అని
అతని తాను ఊరడించుకుంటుంది
ఊహలలో విహరిస్తుంది!
కానీ, సెలవులకోసం ఆశగా ఎదురుచూస్తూంటుంది
పొద్దుపొడిచింది మొదలు
పొద్దు పోయేదాకా
పట్టెడు మెతుకుల కోసం
గుక్కెడు నీళ్ళకోసం గుద్దులాటలతో
దెబ్బలాటలతో సరిపోతూంటే
దానికి తోడు దినకరుడు తన ధాటిని