మనోః స్పర్శ
posted on Jan 31, 2016
మనోః స్పర్శ
కాంతిరేఖలు కురిసాయి
మనోఃతోరణాలు కట్టి
నా జీవన గమ్యాన
అంతర్వాహినిగా
నిను ఆహ్వానించగానే!!
ఎదో కొత్త మత్తు
నా కనులకు
నీ రాకతో
నను ఆవహించి
ఇంతకుముందెన్నడూ లేని
అనుభూతుల పల్లకీలో
తేలిపోతునట్లూ..
నీ అధరాలకేసి చూసే
నా చూపుకి తగిలిన
సుమధుర స్పర్శ
ఎన్ని యుగాలైనా మరువలేను
అపురూప కౌగిలిలో
బంధీనైన ఈ అనుభవం
అమోఘం.
అపురూపం..
అనూహ్యమీ క్షణం!!!
-రఘు ఆళ్ల.